మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bala Stotram 2 – శ్రీ బాలా స్తోత్రం
ఐశ్వర్యం మనసేప్సితం మృదువచో గాంభీర్యమత్యున్నతిం
శిష్టాచార విహార పాలన మథో వేదోక్తమాయుః శ్రియమ్ |
మేధావృద్ధిమపత్యదారజసుఖం వైరాగ్యమత్యున్నతం
నిత్యం త్వచ్చరణారవిందభజనే భక్తిం దృఢాం దేహి మే || 1 ||
క్లీం త్వం కామశరాజితే కరశుకీసల్లాపసమ్మోహితే
సౌందర్యాంబుధిమంథనోద్భవకలానాథాననే భామిని |
కోకాకార కుచాగ్రసీమవిలసద్వీణానుగానోద్యతే
త్వత్పాదాంబుజసేవయా ఖలు శివే సర్వాం సమృద్ధిం భజే || 2 ||
సౌమ్యే పావని పద్మసంభవసఖీం కర్పూరచంద్రప్రభాం
శుద్ధస్ఫాటికవిద్రుమగ్రథితసద్రత్నాఢ్యమాలాధరామ్ |
ధర్త్రీం పుస్తకమిష్టదానమభయం శుక్లాక్షమాలాం కరైః
యస్త్వాం ధ్యాయతి చక్రరాజసదనే సంయాతి విద్యాం గురోః || 3 ||
ఇతి శ్రీ బాలా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.